<?xml version="1.0" encoding="UTF-8"?><song><hymn_number>5</hymn_number>
<lyrics>[V1]
 నిజముగా మొర పెట్టిన
 దేవుడాలకించకుండునా
 సహనముతో కని పెట్టిన
 సమాధానమీయకుండునా
 జీవముగల దేవుడు మౌనముగానుండునా
 తన బిడ్డలకాయన మేలు చేయకుండునా
 సృష్టి కర్త అయిన ప్రభునకు
 మన అక్కర తెలియకుండునా
 సరి అయిన సమయానికి
 దయచేయక ఊరకుండునా
 పరలోక తండ్రినడిగిన
 మంచి ఈవులీయకుండునా
 కరములెత్తి ప్రార్థించిన
 దీవెనలు కురియకుండునా</lyrics>
<title>నిజముగా మొర పెట్టిన</title>
</song>